చివరి టీ20లో భారత్ గెలవడానికి కారణం ఇదే: రవిశాస్త్రి
- సిరీస్ ను గెలుచుకోవడం పట్ల శాస్త్రి హర్షం
- మైదానంలో ఆటగాళ్లు పాదరసంలా కదిలారు
- బుమ్రా చాలా తెలివైన ఆటగాడు
మైదానంలో మెరుపు ఫీల్డింగ్ వల్లే టీమిండియా విజయం సాధ్యమైందని శాస్త్రి అన్నాడు. భారత ఇన్నింగ్స్ ముగిశాక... ఆ స్కోరును కాపాడుకోగలమనే భావించామని చెప్పాడు. 8 ఓవర్ల ఈ మ్యాచ్ లో కేవలం 2 లేదా 3 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపం మారిపోయే అవకాశం ఉంటుందని తెలిపాడు. అద్భుతమైన క్యాచ్ లు పడుతూ, పరుగులను నియంత్రించడంలో కోహ్లీ సేన సఫలమైందని చెప్పాడు. ఒత్తిడి లేకుండానే ఆడామని ఎవరైనా చెబితే, అది కచ్చితంగా అబద్ధమేనని అన్నాడు.