Pawan Kalyan: 'బైటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్'... అంటున్న పవన్ కల్యాణ్... 'అజ్ఞాతవాసి' పాట వినండి!

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం, తొలి పాటను సోషల్ మీడియాలో చిత్ర టీమ్ నేడు విడుదల చేసింది. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా పాట లిరికల్‌ వీడియోను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు పేర్కొన్నారు.

'బైటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్' అంటూ సాగుతున్న పాట లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. ప్రస్తుతం 'ఆజ్ఞాతవాసి' అన్న టైటిల్ ను చిత్రం కోసం పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే సంవత్సరం జనవరిలో సంక్రాంతి సందర్భంగా వెండి తెరలను తాకనున్న ఈ చిత్రం నుంచి బయటకు వచ్చిన తొలి పాటను మీరూ వినండి!
Pawan Kalyan
trivikram srinivas
agnatavasi
lirical video

More Telugu News