సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- బల్గేరియాలో కీర్తితో పవన్ పాట
- మలయాళంలోకి వెళ్లిన 'ఫిదా'
- నితిన్ తో ప్రవీణ్ సత్తారు ప్రాజక్ట్
- విజయ్ 'ఇంద్రసేన' రిలీజ్ డేట్ ఖరారు
* శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో మలయాళంలోకి డబ్ చేశారు. అక్కడ త్వరలో రిలీజ్ చేస్తున్నారు.
* తాజాగా 'పీఎస్వీ గరుడవేగ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు తన తదుపరి చిత్రాన్ని నితిన్ తో చేయనున్నాడు. ఈ చిత్రాన్ని నితిన్ సొంత సంస్థ శ్రేశ్ట్ మూవీస్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
* 'బిచ్చగాడు' ఫేం విజయ్ ఆంథోనీ హీరోగా నటించిన 'ఇంద్రసేన' చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నూతన దర్శకుడు శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డయానా చంపిక కథానాయికగా నటించింది.