lakshmi parvarhi: గండిపేటలోని ఎన్టీఆర్ కుటీరంపై ఆంధ్రజ్యోతి కథనం పట్ల లక్ష్మీపార్వతి స్పందన!

  • గండిపేటలోని ఎన్టీఆర్ కుటీరాన్ని కాపాడుకుంటూ వస్తున్నా
  • దాన్ని అమ్మను, లీజుకు కూడా ఇవ్వను
  • కుటీరాన్ని ఎవరైనా సందర్శించవచ్చు
'అన్నా మన్నించు' పేరుతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు. గండిపేటలో ఉన్న ఎన్టీఆర్ కుటీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నానని ఆమె తెలిపారు. తన భర్తకు సంబంధించి తనకు మిగిలిన ఆస్తి గండిపేటలోని కుటీరం మాత్రమేనని అన్నారు. ఆయన గుర్తుగా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నానని చెప్పారు. గండిపేట కుటీరాన్ని అమ్మే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లీజుకు కూడా ఇవ్వబోనని తెలిపారు. ఎవరైనా సరే గండిపేటకు వచ్చి ఎన్టీఆర్ కుటీరాన్ని చూడవచ్చని చెప్పారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. 
lakshmi parvarhi
ntr
ntr kuteer
gandipet ntr kuteer

More Telugu News