YSRCP: కుమారుడికి ముద్దు పెట్టి ఆశీర్వదించిన విజయమ్మ.. అన్నను ప్రేమతో హత్తుకున్న షర్మిల!

  • కాసేపట్లో ప్రారంభంకానున్న ప్రజా సంకల్ప యాత్ర
  • జనసంద్రంగా మారిన ఇడుపులపాయ
  • భారీ బందోబస్తు చేసిన పోలీసులు
ఆరు నెలల పాటు కొనసాగనున్న వైసీపీ అధినేత జగన్ 'ప్రజా సంకల్ప యాత్ర' కాసేపట్లో ఇడుపులపాయ నుంచి ప్రారంభంకానుంది. కాసేపటి క్రితమే ఆయన ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ కు చేరుకున్నారు. అంతకుముందు తన కుమారుడిని ప్రేమతో ముద్దాడారు జగన్ తల్లి విజయమ్మ. పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని కుమారుడిని ఆశీర్వదించారు. ఆ తర్వాత షర్మిల తన అన్నను ప్రేమతో హత్తుకున్నారు. మీ వెంట మేమున్నామనే భరోసాను కల్పించారు.

మరోవైపు, ఇడుపులపాయ జనసంద్రంగా మారింది. అశేషంగా తరలివచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలతో ఇడుపులపాయలోని సభాప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా... పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. దీనికితోడు, కాసేపటి క్రితం ఇడుపులపాయలో చిరుజల్లు కురిసింది. ఇది మంచికి సంకేతమంటూ వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి.
YSRCP
Jagan
praja sankalpa yatra
idupulapaya

More Telugu News