చరణ్ పాటలు వినిపించాడు.. 'రంగస్థలం' నన్ను వెంటాడుతోంది: మంచు మనోజ్

  • చరణ్ 'రంగస్థలం' పాటలు వినిపించాడు
  • ఆడియో, సినిమాను వెంటనే విడుదల చేయండి
  • ఆగలేక  పోతున్నా
గ్రామీణ నేపథ్యంలో భారీ అంచనాలతో తెరకెక్కుతోంది రామ్ చరణ్ తాజా చిత్రం 'రంగస్థలం'. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. చరణ్ సరసన సమంత నటిస్తోంది. 1985నాటి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వేసవి కానుకగా అభిమానుల ముందుకు వస్తోన్న ఈ సినిమాపై హీరో మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.

"నా సోదరుడు రామ్ చరణ్ 'రంగస్థలం' పాటలు వినిపించినప్పటి నుంచి... అవి నన్ను వెంటాడుతున్నాయి. ఆడియో, సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేయలేకపోతున్నా. వెంటనే విడుదల చేయండి" అంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు, మంచు మనోజ్ నటించిన 'ఒక్కడు మిగిలాడు' సినిమా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 
Go Back to Shorts
manchu manoj
Ramcharan
rangasthalam movie

More Telugu News