అమెరికా పాస్ పోర్టు విధానంలో కొత్త నిబంధనలు.. లైంగిక దాడులకు పాల్పడితే పాస్ పోర్ట్ రద్దు !
- లైంగిక దాడులకు పాల్పడిన వారి పాస్ పోర్టులు రద్దు
- కొత్త పాస్ పార్ట్ లకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి
- విచారణ ఎదుర్కొన్నాడు అంటూ పాస్ పోర్టులో ముద్రిస్తారు
అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఉదారవాదులు మండిపడుతున్నారు. కేవలం ఒక వర్గం వారిని లక్ష్యం చేసుకునే ఈ నిబంధనను తీసుకొస్తున్నారని వారు మండిపడుతున్నారు. 1994లో జరిగిన ఓ ఘటనే ఈ నిబంధనను తీసుకురావడానికి కారణం. మేగన్ కంకా అనే ఏడేళ్ల బాలికను ఓ వ్యక్తి రేప్ చేసి చంపేశాడు. అనంతరం బాలబాలికల రక్షణ కోసం అమెరికా 'అంతర్జాతీయ మేగన్ చట్టం'ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారమే పాస్ పోర్ట్ విధానంలో మార్పులు చేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.