నేనే చెబుదామనుకున్నాను... మీడియా ముందే తెలుసుకుని నన్ను ఓడించేసింది: నాగార్జున

  • 20 నుంచి నాగ్, వర్మల కొత్త చిత్రం షూటింగ్
  • మీడియాలో ముందుగానే వార్తలు
  • పోలీసు అధికారిగా నటిస్తున్నానన్న నాగార్జున
  • యాక్షన్ ఆధారిత చిత్రమని వ్యాఖ్య
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తాను నటించబోయే కొత్త చిత్రం గురించి, తానే స్వయంగా చెబుదామని భావించానని, కానీ, తాను చెప్పేలోగానే మీడియా కనిపెట్టేసి బహిర్గతం చేసిందని హీరో నాగార్జున వ్యాఖ్యానించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టాడు. ఈ నెల 20న చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని, ఇదో స్టైలిష్ యాక్షన్ చిత్రమని, తాను పోలీసు అధికారిగా నటిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

వర్మతో కలసి మరోసారి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు. కాగా, నాగ్ పోస్టును చూసిన అభిమానులంతా, హీరోయిన్ ఎవరు? మన బ్యానర్ లోనే చేయొచ్చుగా? మ్యూజిక్ ఎవరిస్తున్నారు? వంటి ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఇక ఈ ప్రశ్నలకు దేనికీ ఇంకా నాగ్ నుంచి సమాధానం రాలేదు.



Go Back to Shorts
nagarjuna
ram gopal varma
movie

More Telugu News