కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన మాజీ పోలీస్ అధికారిణి అనుపమ
- అక్రమార్కులపై ఉక్కుపాదం మోపిన అనుపమ
- ప్రభుత్వ వైఖరితో విసుగు చెంది రాజీనామా
- భారతీయ జనశక్తి కాంగ్రెస్ పార్టీ స్థాపన
పట్టణంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం, పెద్ద ఎత్తున ఊరేగింపుతో పంచారణ్య కళ్యాణమంటపంలో ఆమె కొత్త పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలతో ప్రజలు విసుగు చెందారని చెప్పారు. తమ పార్టీకి ప్రజల మద్దతు ఉంటుందని తెలిపారు. కర్ణాటకను అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లేలా తమ పార్టీ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలన్న తపన, నాయకత్వ లక్షణాలు ఉన్న వారిని పార్టీలో చేర్చుకుని, అసెంబ్లీలో అడుగుపెడతామని తెలిపారు. 80 లేదా అంతకన్నా స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు.