'క్వీన్' దక్షిణాది రీమేకుల్లో కీలక పాత్రల్లో నటించనున్న ఎల్లీ అవ్రాం, శిబానీ ధండేకర్
- మాతృకలో లీసా హెడెన్ పోషించిన పాత్రకు వీరి ఎంపిక
- ముందు అమీ జాక్సన్‌ను అనుకున్నారు
- కాల్షీట్లు కుదరకపోవడంతో అవకాశాన్ని కోల్పోయిన అమీ
నిజానికి నాలుగు భాషల్లోనూ ఈ పాత్ర కోసం అమీ జాక్సన్ అయితే బాగుంటుందని చిత్ర బృందం ఆమెను కలిశారట. అయితే అమెరికన్ టీవీ సిరీస్ 'సూపర్‌గర్ల్'లో నటించే అవకాశం రావడంతో కాల్షీట్లు కుదరక అమీ ఈ అవకాశాన్ని వదులుకున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ యాంకర్‌గా సుపరిచితురాలైన శిబానీ, హిందీ బిగ్‌బాస్ ద్వారా ప్రాచుర్యం సంపాదించుకున్న ఎల్లీలు లీసా హెడెన్ చేసిన పాత్రకు కొత్తదనం తీసుకువస్తారని మను కుమారన్ అన్నారు. ఈ చిత్రాల్లో కంగనా పాత్రలో తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పారుల్ యాదవ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.