rani jhansi: జైపూర్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న 'మ‌ణిక‌ర్ణిక‌' చిత్రం... ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అవుతున్న చిత్రాలు

  • ఝాన్సీ రాణి లుక్‌లో రాజ‌సం కురిపిస్తున్న కంగ‌నా
  • ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న క్రిష్‌
  • ఆస‌క్తి క‌లిగిస్తున్న షూటింగ్ చిత్రాలు
'సిమ్ర‌న్' చిత్రం త‌ర్వాత కంగ‌నా ర‌నౌత్ న‌టిస్తున్న 'మ‌ణిక‌ర్ణిక‌' చిత్ర షూటింగ్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారాయి. తెలుపు రంగు వస్త్రాల్లో ఝాన్సీ రాణి ల‌క్ష్మీబాయి గెట‌ప్‌లో కంగ‌నాను చూసి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ఈ పాత్ర‌లో కూడా ఆమె జీవించి ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం జైపూర్‌లోని అంబ‌ర్ కోట‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో హిందీ సీరియ‌ల్ న‌టి అంకిత లోఖండే ఝ‌ల్క‌రీ బాయి పాత్ర‌లో నటిస్తోంది. ఝాన్సీ రాణికి బ‌దులుగా ఆమె స్థానంలో బ్రిటిష్ వారితో యుద్ధం చేసిన సైనికురాలి పాత్ర ఇది.
rani jhansi
shooting
jaipur
mani karnika
krish
exclusive pics

More Telugu News