రేవంత్ కు ఎడమ చేత్తో స్వీట్ తినిపించిన రాహుల్.. నెటిజన్ల కామెంట్లు!
- ఫేస్ బుక్ లో ఫొటో పెట్టిన రేవంత్
- ఎడమ చేత్తో స్వీట్ తినిపించడంపై నెటిజన్ల స్పందన
- మనస్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానించలేదంటూ కామెంట్
కష్టపడి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ కు.. రాహుల్ గాంధీ ఎలాంటి బహుమతి ఇచ్చాడో చూడండి అంటూ ఒక నెటిజన్ స్పందించాడు. ఎడమ చేత్తో స్వీట్ పెట్టాడంటే, మీకు హ్యాండ్ ఇచ్చినట్టే అంటూ మరొకరు స్పందించారు. ఎడమ చేత్తో స్వీట్ పెడుతున్నాడంటే అది విషంతో సమానమని, మిమ్మల్ని రాహుల్ మనస్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానించలేదని మరొకరు కామెంట్ చేశారు. ఇలా పలువురు పలురకాలుగా కామెంట్ చేస్తున్నారు.