తడబడ్డా లాభాలతో... సరి కొత్త రికార్డులకు భారత స్టాక్ మార్కెట్!
- సెషన్ ఆరంభంలోనే లాభాలు
- మధ్యలో తడబడ్డా నిలిచిన లాభం
- 0.33 శాతం పెరిగిన సెన్సెక్స్
బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.13 శాతం లాభపడింది. ఎన్ఎస్ఈ-50లో 30 కంపెనీలు లాభాల్లో నడిచాయి. యస్ బ్యాంక్, లుపిన్, ఇన్ ఫ్రాటెల్, ఐచర్ మోటార్స్, టాటా మోటార్స్ తదితర కంపెనీలు లాభపడగా, హెచ్‌సీఎల్ టెక్, హిందుస్థాన్ యూనీలీవర్, ఐటీసీ, విప్రో, ఎంఅండ్ఎం తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,43,93,153 కోట్లకు పెరిగింది. బీఎస్ఈలో మొత్తం 2,825 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1703 కంపెనీలు లాభాలను, 977 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.83 వద్ద కొనసాగుతోంది.