revant reddy: రేవంత్ వెనుకే మేము... వీళ్లంతా కన్ఫార్మ్ చేశారు!

  • సీతక్క, బోడ జనార్దన్, అరికెల నర్సారెడ్డి కన్ఫార్మ్
  • 3 వేల మంది క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా
  • ఇంకొన్ని రోజులు వేచి చూద్దామంటున్న కొందరు సీనియర్లు
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి వెనుక నడుస్తూ, ఆయనతో కలిసి కాంగ్రెస్ లో చేరబోయేది ఎవరన్న విషయం దాదాపు తెలిసిపోయింది. రేవంత్ తో పాటు కాంగ్రెస్ లో చేరే టీడీపీ ముఖ్య నేతల్లో వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతక్క, బోడ జనార్దన్, అరికెల నర్సారెడ్డి, సోయం బాపూరావు, భూపాల్ రెడ్డి తదితరులు ఉన్నట్టు సమాచారం. వీరంతా కీలక నేతలు కాగా, వీరి నేతృత్వంలో మరో రెండు నుంచి మూడు వేల మందికి పైగా క్షేత్ర స్థాయి టీడీపీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ లో తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కునేందుకు వస్తున్నట్టు రేవంత్ సన్నిహితులు పేర్కొన్నారు. మరింత మంది సీనియర్ నేతలు ఇంకొన్ని రోజులు సమయం వేచి చూద్దామని భావిస్తున్నారని తెలిపారు. కాగా, రేవంత్ తో పాటు కాంగ్రెస్ లో చేరే విషయమై నల్గొండ జిల్లా ముఖ్య నేత, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి తన కార్యకర్తలతో చర్చిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
revant reddy
congress
Telugudesam leaders

More Telugu News