dommati sambaiah: రేవంత్ ఇంట్లో వరంగల్ టీఆర్ఎస్ నేత దొమ్మాటి... ఫిరాయింపా? సాన్నిహిత్యమా?

  • ఆత్మీయ సమావేశానికి వచ్చిన దొమ్మాటి సాంబయ్య
  • కాంగ్రెస్ లో చేరేందుకేనా? 
  • ఫిరాయింపుపై స్పష్టత ఇవ్వని నేత
  • రేవంత్ తో ఏకాంతంగా చర్చలు
ఈ ఉదయం రేవంత్ తన నివాసంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశానికి వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత దొమ్మాటి సాంబయ్య అనూహ్యంగా హాజరయ్యారు. రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో పలకరించి పోదామని వచ్చారా? లేక, ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరే ఉద్దేశమేదైనా ఉందా? అన్న విషయమై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ, రేవంత్ ఇంటికి సాంబయ్య రావడం, వీరిద్దరూ కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోవడం, అక్కడ తీవ్ర చర్చకు దారితీసింది. అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రాకమునుపే రేవంత్ ఇంటికి వచ్చిన దొమ్మాటి, కాసేపు గడిపి తిరిగి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
dommati sambaiah
revant reddy
congress

More Telugu News