revant reddy: కంచర్ల భూపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు పంపిన ఎల్.రమణ

  • రేవంత్ కు అనుకూలంగా మాట్లాడిన కంచర్ల
  • సమాధానం చెప్పాలని ఆదేశించిన ఎల్ రమణ
  • లేకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరిక
రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఎందుకు మాట్లాడారో తెలియజేయాలని కోరుతూ నల్గొండ టీడీపీ ఇన్ చార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు అందాయి. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఈ నోటీసులను పంపుతూ, వెంటనే సమాధానం చెప్పాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించినందున క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలియజేయాలని అడిగారు.

కాగా, రేవంత్ తో పాటు భూపాల్ రెడ్డి కూడా టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది. రేవంత్ వెంట కాంగ్రెస్ లో చేరబోయే 30 మందికి పైగా ప్రధాన నేతల్లో భూపాల్ కూడా ఉన్నట్టు ఇప్పటికే స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి రమణ పేరిట నోటీసులు జారీ కావడం గమనార్హం.
revant reddy
congress
l ramana
Telugudesam
kancherla bhupal reddy

More Telugu News