indrakeeladri: ఇంద్రకీలాద్రిపై అపచారం... వల్లీ అమ్మవారి మంగళసూత్రం తాకట్టు!

  • గుర్తించి విడిపించుకుని తెచ్చిన అధికారులు
  • బహిరంగంగా మాట్లాడేందుకు నిరాకరణ
  • ఇంకా ఎన్ని ఆభరణాలు తాకట్టు పెట్టారో?
  • భక్తుల అనుమానం!
కనకదుర్గమ్మ కొలువై ఉండే విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపచారం జరిగింది. కొండపై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉపాలయంలోని శ్రీవల్లీ అమ్మవారి మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టారన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ఓ అర్చకుడు ఈ పని చేశాడని భావిస్తుండగా, అధికారులు ఆగమేఘాల మీద మంగళసూత్రాన్ని విడిపించుకుని తెచ్చి, తిరిగి అమ్మవారికి అలంకరించినట్టు తెలుస్తోంది.

ఈ విషయంలో వివరణ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. అంతర్గతంగా విచారణ జరుగుతోందని, తప్పు ఎవరు చేసినా శిక్ష ఉంటుందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి పేర్కొన్నారు. కాగా, కొందరు అధికారుల ప్రోద్బలంతోనే కొండపై ఇటువంటివి జరుగుతున్నాయని, ఇంకా దేవీ, స్వామివార్లకు చెందిన ఎన్ని ఆభరణాలు ఇలా బయటకు వెళ్లాయో లెక్క తేల్చాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
indrakeeladri
durgamma
valli ammavaru
mukkupudaka

More Telugu News