Vodafone India: మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌తో వినియోగ‌దారుల‌ ముందుకు వ‌చ్చిన వొడాఫోన్‌!

షార్ట్స్‌లో చూడండి
టెలికాం కంపెనీ వొడాఫోన్ త‌మ వినియోగ‌దారుల ముందుకు మ‌రో ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది. సూప‌ర్ వీక్ ప్లాన్ పేరుతో రూ.69తో రీచార్జ్ చేసుకుంటే వారం రోజుల పాటు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌తో పాటు 500 ఎంబీ డేటాను పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది. త‌మ ప్రీపెయిడ్ వినియోగ‌దారులు ప్రతి ఏడు రోజులకు ఒకసారి దీన్ని కొనుగోలు చేయవ‌చ్చ‌ని పేర్కొంది.

త‌మ కంపెనీ మంచి నెట్‌వర్క్‌ను, సర్వీసు అనుభవాన్ని త‌క్కువ ధ‌ర‌ల‌కే అందిస్తోంద‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు అన్నారు. తాము తీసుకొచ్చిన ఈ కొత్త ప్యాక్‌ను రిటైల్‌ అవుట్‌లెట్లు, యూఎస్‌ఎస్‌డీ, వెబ్‌సైట్‌, మైవొడాఫోన్‌ యాప్‌ ద్వారా పొంద‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. 
Go Back to Shorts
Vodafone India
4G

More Telugu News