shakalaka shankar: 'డ్రైవర్ రాముడు'గా కమెడియన్ షకలక శంకర్ .. ఫస్టులుక్ రిలీజ్

  • కమెడియన్ గా షకలక శంకర్ కి గుర్తింపు 
  • హీరో వేషాల వైపు అడుగులు 
  • 'డ్రైవర్ రాముడు'లో హీరోగా ఛాన్స్  
తెలుగు తెరపై ప్రస్తుతం కమెడియన్స్ గా రాణిస్తోన్న శ్రీనివాస్ రెడ్డి .. సప్తగిరి హీరోలుగా మారిపోయారు. ఒక వైపున కమెడియన్ గా చేస్తూనే హీరోగా వస్తోన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. అలా షకలక శంకర్ కూడా హీరోగా ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇటు బుల్లితెరపైనా .. అటు వెండితెరపైన కమెడియన్ గా షకలక శంకర్ కి మంచి గుర్తింపు వుంది.

ఆ క్రేజ్ తోనే ఆయన 'డ్రైవర్ రాముడు' సినిమాతో హీరోగా మారుతున్నాడు. రాజు - కిషన్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి రాజ్ సత్య దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. 'డ్రైవర్ రాముడు'గా ఎన్టీఆర్ స్టైల్లో .. షకలక శంకర్ ఆకట్టుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకూ కమెడియన్ గా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశాడు. ఇక ముందు హీరోగా కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పాడు. 
shakalaka shankar

More Telugu News