kcr: గవర్నర్ నరసింహన్ ను కలిసి చర్చలు జరిపిన కేసీఆర్

  • అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో భేటీ
  • బిల్లులు, తీర్మానాల గురించి నరసింహన్ కు వివరించిన కేసీఆర్
  • 40 నిమిషాలు సాగిన చర్చ
కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు,  రాజ్‌ భవన్‌ కు వెళ్లి గవర్నర్‌ నరసింహన్‌ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. త్వరలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ప్రవేశపెట్టనున్న బిల్లులు, తీర్మానాల గురించి గవర్నర్‌ కు తెలియజేసేందుకే కేసీఆర్ వచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

సుమారు 40 నిమిషాల పాటు జరిగిన వీరి భేటీలో, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటి మట్టాలు, కాళేశ్వరానికి కేంద్ర పర్యావరణ అనుమతులు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా, మధ్యాహ్నం తరువాత టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం జరుగనుండగా, కేసీఆర్ దానికి హాజరుకానున్నారు. తెలంగాణ శాసన సభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం కూడా నేడు జరగనుంది.
kcr
narasimhan
telangana
assembly

More Telugu News