dhruv vikram: జనవరిలో సెట్స్ పైకి 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్!

  • తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన 'అర్జున్ రెడ్డి'
  • తమిళ రీమేక్ కి సన్నాహాలు 
  • హీరోగా విక్రమ్ తనయుడు 'ధృవ్'
  • దర్శకుడిగా బాల
తెలుగు .. తమిళ భాషల్లో విక్రమ్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ప్రయోగాత్మక పాత్రలకు పెట్టింది పేరుగా ఆయన గురించి చెప్పుకుంటూ వుంటారు. అలాంటి విక్రమ్ సరైన కథతో తన తనయుడు 'ధృవ్' ను వెండితెరకి పరిచయం చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన 'అర్జున్ రెడ్డి' సినిమా టాక్ ఆయన చెవిన పడింది.

 ఈ సినిమా చూసిన ఆయన ఈ కథ ద్వారా 'ధృవ్' ను హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాకి బాల దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు కూడా చెప్పారు. దాంతో విక్రమ్ అభిమానులంతా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవరిలో మొదలు కానుందనేది తాజా సమాచారం. తొలి సినిమాతోనే 'ధృవ్' హిట్ కొడతాడేమో చూడాలి మరి.     
dhruv vikram

More Telugu News