revant reddy: చంద్రబాబు నాకు పవర్స్ ఇచ్చారు... ఏ నిర్ణయమైనా నాదే: ఎల్.రమణ
- తెలంగాణకు సంబంధించినంత వరకూ పూర్తి అధికారాలు ఇచ్చారు
- రేవంత్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నడూ ప్రకటించలేదు
- ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకూ తనకు పూర్తి అధికారాలు ఇచ్చారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. ఏ నిర్ణయం తీసుకున్నా తననే తీసుకోమని ఆదేశించారని చెప్పారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, రేవంత్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్టు తమ పార్టీ ఎన్నడూ అధికారికంగా ప్రకటించలేదని గుర్తు చేసిన ఆయన, ఓ ఎమ్మెల్యేగా మాత్రమే ఆయన్ను పరిగణిస్తున్నామని తెలిపారు.
ముందుగా అనుకున్న ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు టీడీపీ, బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని, దీనికి రావాలని రేవంత్ కు సమాచారాన్ని పంపామని, వచ్చేది, రానిదీ ఆయన ఇష్టమని తెలిపారు. తమ అధినేత వచ్చిన తరువాత అన్ని విషయాలను ఆయనతో చర్చించి రేవంత్ పై తుది నిర్ణయం తీసుకుంటామని రమణ పేర్కొన్నారు.