ఇమేజ్ కోసం క్రికెటర్లు, నటులతో డేటింగ్ చేయమని సలహా ఇచ్చారు... బాలీవుడ్ నటి రిచా చద్దా సంచలన వ్యాఖ్యలు!
- డేటింగ్‌కు నిరాకరించడం వల్లే తనకు స్నేహితులు తక్కువన్న బ్యూటీ
- ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తవారికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతాయని వ్యాఖ్య
- ‘గంగాస్ ఆఫ్ వాసేయ్‌పూర్’ చిత్రంలో నటనకు ప్రశంసలు
అయితే తానెప్పుడూ డేటింగ్ జోలికి వెళ్లలేదని పేర్కొంది. బయట నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చిన వారికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతాయని చెప్పింది. తనకు ఇటువంటివి ఇష్టం లేకపోవడం వల్లే ఇండస్ట్రీలో చాలా తక్కువమంది స్నేహితులు ఉన్నారని వివరించింది. ఇండస్ట్రీలో అందరితో సంబంధాలు ఉండాలని, కానీ అవి ఈ తరహా మాత్రం కాకూడదని పేర్కొంది.
ప్రముఖ దర్శకనిర్మాత దివాకర్ బెనర్జీ తెరకెక్కించిన ‘ఓయ్ లక్కీ లక్కీ ఓయ్’ సినిమాతో రిచా చద్దా బాలీవుడ్లో అడుగుపెట్టింది. అనురాగ్ కశ్యప్ చిత్రం ‘గంగాస్ ఆఫ్ వాసేయ్‌పూర్’ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ఆమె నటించిన ‘జియా ఔర్ జియా’ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.