Love: పెళ్లికి నిరాకరించిన యువతి.. ఫొటోను అశ్లీల సైట్‌లో పెట్టిన ప్రబుద్ధుడు

  • ఫోన్లు రావడంతో కలత చెందిన యువతి
  • పోలీసులకు ఫిర్యాదు
  • నిందితుడికి అరదండాలు
పెళ్లికి నిరాకరించిన యువతి ఫొటోను అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడో యువకుడు. ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్న ఆ ప్రబుద్ధుడి పేరు మహ్మద్ యూసుఫ్ (24). పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని జహనుమా గుల్జార్‌నగర్‌కు చెందిన యూసుఫ్ ఆరు నెలల క్రితం బాధిత యువతి (22) వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అందుకు ఆమె నిరాకరించింది.

దీంతో కక్షపెంచుకున్న యూసుఫ్ ఆమె ఫేస్‌బుక్ ఖాతాలోని ఫొటోను దొంగిలించి, పోన్ నంబరు సహా అశ్లీల వెబ్‌సైట్‌లో పెట్టాడు. ఫోన్లు రావడంతో తీవ్ర మనోవేదనకు గురైన యువతి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యూసుఫ్‌ను వలపన్ని పట్టుకున్నట్టు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.
Love
marriage
girl
arrest
hyderabad

More Telugu News