Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త ఫీచ‌ర్ ప్ర‌వేశ‌పెట్టిన ఇన్‌స్టాగ్రాం... ఒకే లైవ్‌లో ఎక్కువ మంది పాల్గొనే అవ‌కాశం

  • ఇవాళ్టి నుంచే ప్రారంభం
  • బ్లాగ్‌లో ప్ర‌క‌టించిన ఇన్‌స్టాగ్రాం
  • స్నేహితులంతా క‌లిసిక‌ట్టుగా లైవ్ చేసే స‌దుపాయం
ఫేస్‌బుక్ వారి ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రాం గ‌త న‌వంబ‌ర్‌లో లైవ్ వీడియో ఫీచ‌ర్ ప్ర‌వేశ‌పెట్టిన నాటి నుంచి ఎంతో మంది ఆ స‌దుపాయాన్ని వాడుకునేందుకు ఆస‌క్తి చూపించారు. త‌మకు సంబంధించిన ప్ర‌తి చిన్న విష‌యాన్ని ఫొటోల కంటే లైవ్‌ల ద్వారా అందించేందుకే మొగ్గు చూపారు. అలా లైవ్ చేసే వారి కోసం ఇప్పుడు మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్‌ని ఇన్‌స్టాగ్రాం అందించింది. ఒకే లైవ్‌లో ఎక్కువ మంది పాల్గొనే అవ‌కాశాన్ని క‌ల్పించింది. ఇవాళ్టి నుంచి ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రానున్న‌ట్లు త‌మ బ్లాగ్‌లో పేర్కొంది.

యాప్ అప్‌డేట్ చేసుకున్న త‌ర్వాత లైవ్ చేసేట‌ప్పుడు ప‌క్క‌న `Add` బ‌ట‌న్ వ‌స్తుంది. దాని ద్వారా అప్పుడు లైవ్ చూస్తున్న వారిలో నుంచి ఎంపిక చేసుకుని వారితో క‌లిసి లైవ్ చేయ‌వ‌చ్చు. వెంట‌నే మీ లైవ్ స్క్రీన్ భాగాలుగా విడిపోతుంది. ఆ భాగాల్లో గ్రూప్ లైవ్ చేస్తున్న వారంతా క‌నిపిస్తారు. స్నేహితులంద‌రూ క‌లిసి లైవ్ చేయాల‌నుకునే వారికి ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఇన్‌స్టాగ్రాం పేర్కొంది.
instagram
live together
new feature
multile live

More Telugu News