తల్లయిన నటి అసిన్.. పండంటి పాపకు జన్మనిచ్చిన అందాలభామ!
- గతేడాది మైక్రోమ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మతో వివాహం
- ఈ నెల 26తో 31వ వసంతంలోకి అసిన్
- మర్చిపోలేని బర్త్‌డే గిఫ్ట్ అని వ్యాఖ్య
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘గజినీ’ సినిమా రీమేక్‌తో అసిన్ బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఆమిర్‌ఖాన్‌తో కలిసి నటించింది. తెలుగులో రవితేజ సరసన ‘అమ్మ, నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాలో నటించింది. గతేడాది జనవరి 19న రాహుల్ శర్మను వివాహం చేసుకుంది. తొలుత క్రిస్టియన్ వివాహ పద్ధతిలోను తర్వాత, హిందూ వివాహ పద్ధతిలోను వీరి వివాహం జరిగింది.