ఏపీ: ఏపీ అభివృద్ధికి విజయా బ్యాంక్ రుణం మంజూరు!
- రూ.2,000 కోట్ల రుణం మంజూరు
- రహదారుల అభివృద్ధి సంస్థకు రూ.1000 కోట్లు, జలవనరుల అభివృద్ధి సంస్థకు మరో రూ.1000 కోట్లు
- రుణ మంజూరు పత్రాలను అందుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఏపీ అభివృద్ధికి విజయా బ్యాంక్ రుణం మంజూరు చేసింది. రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థకు రూ.1000 కోట్లు, జలవనరుల అభివృద్ధి సంస్థకు మరో రూ.1000 కోట్ల చొప్పున మొత్తం రెండు వేల కోట్ల రూపాయలను విజయా బ్యాంక్ అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కు ఇందుకు సంబంధించిన రుణ మంజూరు పత్రాలను విజయా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, ఎండీ ఆర్ఏ శంకర్ నారాయణన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై.నాగేశ్వరరావు ఈరోజు అందజేశారు.