షారుక్ `ఫ్యాన్` సినిమాలో `జబ్రా ఫ్యాన్` పాట పెట్టలేదని నిర్మాతలపై కేసు... విజయం సాధించిన అభిమాని!
- నిడివి దృష్ట్యా పాటను తొలగించిన నిర్మాతలు
- కేసు వేసిన మహిళా అభిమాని
- రూ. 15,000 నష్టపరిహారం చెల్లించిన యశ్‌రాజ్ ఫిలింస్
ఈ విషయంపై విచారణ చేపట్టిన మహారాష్ట్ర వినియోగదారుల ఫోరానికి చెందిన ఔరంగాబాద్ బెంచ్ అఫ్రీన్‌కి రూ. 15,000 నష్టపరిహారం చెల్లించాలని సినిమా నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్‌ను ఆదేశించింది. అభిమానిని మానసికంగా వేధించినందుకు గాను రూ. 10,000, ఫిర్యాదు ఖర్చు రూ. 5000 చెల్లించాలని పేర్కొంది.