రైల్లో ఏసీ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే విమానంలో గమ్యస్థానానికి?
- యోచిస్తోన్న రైల్వే శాఖ
- ఎయిరిండియాకు ప్రతిపాదనలు పంపిన రైల్వే బోర్డు చైర్మన్
- ఇప్పుడే చెప్పలేమన్న ఎయిరిండియా చైర్మన్
వెయిటింగ్ లిస్టులో ఉండి, టికెట్ కన్ఫర్మ్ కాని రాజధాని ఏసీ టికెట్ ఉన్న ప్రయాణికుల వివరాలను ఎయిరిండియాకు పంపించి, ఎలాంటి అధిక ఛార్జీలు వసూలు చేయకుండా వారిని గమ్యస్థానాలకు చేరవేసే ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఎయిరిండియాకు పంపినట్లు అశ్వనీ లోహాని తెలిపారు. అయితే ఈ ప్రతిపాదన మీద తాను ఇప్పుడే ఏం చెప్పలేనని, రైల్వేకు, విమాన చార్జీలకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్న కారణంగా కొంత ఆలోచించాల్సి ఉందని ఎయిర్ ఇండియా ఛైర్మన్ రాజీవ్ బన్సాల్ చెప్పారు.