ఫిరాయింపునకు కోటి రూపాయలు మాట్లాడారు, రూ. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు: బీజేపీపై పటీదార్ నేత సంచలన ఆరోపణ
- డబ్బులు తెచ్చి మీడియాకు చూపిన వరుణ్ పటేల్
- కాంగ్రెస్ తో కుమ్మక్కై ఆరోపణలు చేస్తున్నారు
- డబ్బు బీజేపీదేనని చెప్పడానికి ఆధారాలు ఏంటి?
- ప్రశ్నించిన బీజేపీ నేతలు
తనకు రూ. కోటి ఇచ్చేందుకు బీజేపీ నేతలు బేరం కుదుర్చుకున్నారని, రూ. 10 లక్షలు ఇచ్చారని, ఆ డబ్బులు ఇవేనని చెబుతూ డబ్బులు చూపారు. రిజర్వ్ బ్యాంకు మొత్తాన్ని తన పేరిట రాసినా పటీదార్ అనామత్ ఆందోళన్ సమితికి అన్యాయం చేయబోనని తేల్చి చెప్పారు. కాగా, నరేంద్ర పటేల్ ఆరోపణలను వరుణ్ ఖండించారు. కాంగ్రెస్ తో కుమ్మక్కై ఈ ఆరోపణలు చేస్తున్నారని, డబ్బు బీజేపీదేనని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయా? అని అడిగారు. కాగా, నరేంద్ర ఆరోపణలపై బీజేపీ అధికారికంగా ఇంకా స్పందించలేదు.