టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తు: రేవంత్ రెడ్డి వల్ల పార్టీకి నష్టమే.. టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తుకు అవకాశం ఉంది: మోత్కుపల్లి కీలక వ్యాఖ్య
- కేంద్రంలో బీజేపీతో పొత్తు ఉంది
- తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు ఎలా పెట్టుకుంటాం?
- తెలంగాణలో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు
- నేను, కేసీఆర్ మంచి స్నేహితులం
తమ పార్టీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని సంకేతాలు వస్తోన్న వేళ ఇతర టీటీడీపీ నేతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏపీ నేతలకు అంతగా చనువు ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీతో పొత్తు ఉండగా తెలంగాణలో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని అన్నారు.
కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తాము.. ఇక్కడ కాంగ్రెస్ తో ఎలా పెట్టుకుంటామని మోత్కుపల్లి ప్రశ్నించారు. టీఆర్ఎస్‌తో టీటీడీపీ పొత్తు పెట్టుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. తాను, కేసీఆర్ మంచి స్నేహితులమని అన్నారు. తాను చివరి వరకు టీడీపీలోనే ఉంటానని చెప్పారు. రేవంత్ రెడ్డి వల్ల తమ పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటే అదిష్ఠానం మాత్రమే తీసుకోవాలని అన్నారు.