: రేవంత్ రెడ్డి: పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు: రేవంత్ రెడ్డి తీరుపై ఎల్.రమణ మీడియా సమావేశం
- రాష్ట్ర ప్రజానీకంలో గందరగోళం నింపేలా ప్రవర్తించకూడదు
- అధిష్ఠానం సూచించిన విధంగా నడుచుకోవాలి
- ఏ విషయమైనా అధిష్ఠానంతో చర్చించే ముందుకు వెళ్లాలి
- తమ వైఖరి ఏంటనే విషయంపై మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందే
రాష్ట్ర ప్రజానీకంలో గందరగోళం నింపేలా ప్రవర్తించకూడదని తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ప్రభుత్వ పరిపాలనా విధానాలైనా, పార్టీకి సంబంధించిన విధానాలైనా తమ రాష్ట్ర శాఖ ఎల్లప్పుడూ అధిష్ఠానంతో చర్చించే ముందుకు వెళుతుందని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఎటువంటి పాత్ర పోషించాలనే విషయంపై చర్చించాల్సి ఉందని అన్నారు.
పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదని ఎల్.రమణ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అభద్రతా భావం తలెత్తేలా చేయకూడదని అన్నారు. తమ వైఖరి ఏంటనే విషయంపై మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందేనని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తమ పార్టీ క్షమశిక్షణకు మారుపేరని అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఇతర పార్టీల వారిని ప్రత్యర్థులుగానే చూశామని, శత్రువులుగా మాత్రం చూడలేదని అన్నారు. చంద్రబాబు సూచించిన విధంగా నడుచుకోవాలని అన్నారు.