ఇంటర్వ్యూలో సహనాన్ని కోల్పోయిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నిర్మాత!
- వెన్నుపోటు పొడవటం మీరు చూశారా?
- ఈ సినిమాకు, రాజకీయాలకు సంబంధం లేదు
- నా దగ్గర డబ్బు లేదని ఎవరు చెప్పారు?
ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారని... ఆ సన్నివేశం ఈ సినిమాలో ఉంటుందా? అని రాకేష్ రెడ్డిని యాంకర్ అడిగారు. దీనికి సమాధానంగా వెన్నుపోటు పొడిచింది మీరు చూశారా? అంటూ ఎదురు ప్రశ్నించారు రాకేష్. అయితే వెన్నుపోటు పొడవలేదని మీరు అంటారా? అని యాంకర్ ప్రశ్నించగా... సహనాన్ని కోల్పోయిన రాకేష్ రెడ్డి ఆ విషయాన్ని సినిమాలోనే చూడాలని ఒకింత ఆగ్రహంగా చెప్పారు.
తాను సినిమా గురించి మాట్లాడటానికే ఇక్కడకు వచ్చానని... రాజకీయాల గురించి మాట్లాడటానికి రాలేదని స్పష్టం చేశారు. వైసీపీకి, ఈ సినిమా నిర్మాణానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాకేష్ రెడ్డి వద్ద సినిమా తీసేంత డబ్బు లేదని... ఈ సినిమాకు ఫైనాన్స్ చేస్తున్నది జగన్ అనే ఆరోపణలు ఉన్నాయన్న ప్రశ్నకు బదులుగా... తన వద్ద డబ్బు లేదని నిరూపిస్తే మీరు ఏం చెప్పినా చేస్తానని... నిరూపించలేకపోతే చానల్ ను క్లోజ్ చేసుకోవాలని అన్నారు.