రహానే బ్యాటింగ్ ఆర్డర్ పై పూర్తి నిర్ణయం కోహ్లీదే: రోహిత్ శర్మ
- ఆసీస్ తో వన్డే సిరీస్ లో ఓపెనర్ గా బ్యాటింగ్ కు వచ్చిన రహానే
- న్యూజిలాండ్ సిరీస్ లో ఓపెనర్ గా వస్తాడా? అని ప్రశ్నించిన మీడియా
- రహానే బ్యాటింగ్ ఆర్డర్ పై పూర్తి నిర్ణయం కోహ్లీదేనని స్పష్టం చేసిన రోహిత్
వన్ డౌన్ లో కెప్టెన్ కోహ్లీ వస్తాడని, ఆ తరువాత రహానే బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉందని అన్నాడు. ఆ స్థానంలో గతంలో బ్యాటింగ్ చేసిన అనుభవం రహానేకు ఉందని గుర్తుచేశాడు. అయితే రహానే బ్యాటింగ్ ఆర్డర్ పై నిర్ణయాధికారం పూర్తిగా కెప్టెన్ కోహ్లీదేనని తెలిపాడు. కోహ్లీ, రవిశాస్త్రి దానిని నిర్ణయిస్తారని అన్నాడు. కాగా, రేపటి నుంచి భారత్ లో న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.