బస్సుకు బ్రేక్ వేసి స్టీరింగ్ పై వాలిపోయిన డ్రైవర్!
- ఎస్ కోట నుంచి విజయనగరం బయల్దేరిన బస్సు
- ధర్మవరం పరిసరాల్లోకి వచ్చేసరికి డ్రైవర్ కు ఛాతి నొప్పి
- క్షణాల్లో బస్సుకు బ్రేక్ వేసి స్టీరింగ్ పై వాలిపోయిన డ్రైవర్
దీంతో అధికారులకు సమాచారం ఇచ్చిన ప్రయాణికులు వెంటనే వేరే వాహనంలో శృంగవరపుకోట ఆసుపత్రికి తరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, నిన్న గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో బస్సు నడుపుతున్న డ్రైవర్ కు గుండెపోటు రావడంతో బస్సులోనే మృతి చెందగా, ఆ సమయంలో అదుపుతప్పిన బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో మరో ఇద్దరు మృతి చెందారు. అలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా డ్రైవర్ శ్రీను చాకచక్యంగా వ్యవహరించాడు.