revant reddy: అసలేం అనుకుంటున్నారో నిజం చెప్పండి?: డైరెక్టుగా రేవంత్ ను నిలదీసిన ఎల్.రమణ

  • అంచనాలను తలకిందులు చేస్తూ టీటీడీపీ సమావేశానికి రేవంత్
  • పార్టీ మారడంపై ప్రశ్నల వర్షం గుప్పించిన నేతలు
  • ఎప్పుడైనా చెప్పానా? అని ఎదురు ప్రశ్నించిన రేవంత్
  • కొనసాగుతున్న సమావేశం
కాంగ్రెస్ పార్టీలో చేరాలని టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారని రూఢీగా తెలుస్తున్న వేళ, ఈ ఉదయం హైదరాబాదు, బంజారాహిల్స్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో టీటీడీపీ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగగా, అంచనాలను తలకిందులు చేస్తూ, రేవంత్ రెడ్డి వచ్చారు. ఆయన్ను చూడగానే పలువురు అభిమానులు ఎదురెళ్లి స్వాగతం పలికారు. నవ్వుతూ లోపలికి వచ్చి వర్కింగ్ కమిటీ సమావేశానికి వెళ్లిన రేవంత్ ను, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ కాస్తంత గట్టిగానే నిలదీసినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ లో చేరుతున్నట్టు వస్తున్న వార్తల గురించి ప్రస్తావించిన ఆయన, అసలేం అనుకుంటున్నారో నిజం చెప్పాలని నిలదీసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ మారాలని భావిస్తే, అసలు ఈ సమావేశానికి రాకుండా ఉండాల్సిందని కూడా ఆయన అన్నట్టు సమాచారం. ఇక తాను పార్టీ మారుతున్నట్టు ఎన్నడైనా, ఎక్కడైనా చెప్పానా? అని ఎల్.రమణను ఎదురు ప్రశ్నించిన రేవంత్, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో టీడీపీ విఫలమవుతోందని ఆరోపించినట్టు తెలుస్తోంది. తాను పార్టీ మారే విషయమై మాత్రం ఆయన ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదని సమాచారం. టీడీపీ నేతల భేటీ ఇంకా కొనసాగుతోంది.
revant reddy
congress
l ramana
Telugudesam

More Telugu News