revanth reddy: ఆ గంటన్నర పాటు రేవంత్ ఏమయ్యారు?... టీడీపీ నేతల్లో ఉదయిస్తున్న ప్రశ్న!

  • ఉదయం పది గంటలకు ఇంటి నుంచి బయల్దేరిన రేవంత్ రెడ్డి
  •  11:30 గంటల తరువాత టీడీపీ భవన్ కు చేరిన రేవంత్ రెడ్డి
  • సుమారు గంటన్నర పాటు ఆయన ఎక్కడికెళ్లారన్న అనుమానాలు
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గంటన్నరపాటు ఏమయ్యారంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలతో ఆయన సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నేటి ఉదయం పది గంటలకు ఇంటి నుంచి బయల్దేరిన రేవంత్ రెడ్డి 11:30 నిమిషాలకు టీడీపీ భవన్ కు చేరుకున్నారు. ఈ గంటన్నర సేపు ఆయన ఎక్కడికి వెళ్లారన్న అనుమానాలు అందర్లోనూ వ్యక్తమవుతున్నాయి.

 రేవంత్ రెడ్డి, అతని అనుచరులు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గుడికి వెళ్లామని చెబుతుండగా, కాదు, కాంగ్రెస్ నేతలతో వీరు సమావేశమయ్యారని మరికొందరు చెబుతున్నారు. గోల్కండ హోటల్ లో కాంగ్రెస్ పార్టీలో తనను వ్యతిరేకించే నేతలతో రేవంత్ సమావేశమైనట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన తనతో పాటు కాంగ్రెస్ లో చేరే టీడీపీ నేతల జాబితాను కాంగ్రెస్ పెద్దలకు అందించినట్టు తెలుస్తోంది. 
revanth reddy
Telugudesam
hydarabad
Telugudesam bhavan

More Telugu News