virat kohli: ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్ కోహ్లీనే: పాక్ పేస్ బౌలర్ మహ్మద్ అమీర్

  • కోహ్లీకి ఛాన్స్ ఇస్తే ఆట మొత్తాన్ని లాగేసుకుంటాడు
  • ప్రపంచంలోని బౌలర్లకు కోహ్లీ పెద్ద సవాల్
  • కోహ్లీకి బౌలింగ్ చేయాలంటే శక్తిమేర బంతులు వేయాలి
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ పేస్ బౌలర్ మహ్మద్ అమీర్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్ కోహ్లీనే అంటూ కితాబిచ్చాడు. కోహ్లీకి బౌలింగ్ చేయాలంటే శక్తిమేర బంతులను సంధించాల్సిందేనని చెప్పాడు. గాయం నుంచి కోలుకున్న అమీర్ ఇటీవలే మళ్లీ జట్టులోకి చ్చాడు.

ఈ సందర్భంగా కోహ్లీ సంతోషాన్ని వ్యక్తి పరిచాడు. ఓ టీవీ షోలో మాట్లాడుతూ, అమీర్ బాగా రాణిస్తున్నాడని... ప్రపంచంలోని టాప్ ముగ్గురు బౌలర్లలో అతను కూడా ఒకడని కోహ్లీ వ్యాఖ్యానించాడు. నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లలో అమీర్ కూడా ఒకడని తెలిపాడు. తనపై కోహ్లీ కురింపించిన ప్రశంసలకు అమీర్ ఉబ్బితబ్బిబ్బు అయ్యాడు. వెంటనే కోహ్లీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. కోహ్లీకి గనుక ఛాన్స్ ఇస్తే... మొత్తం ఆటను తనవైపు లాగేసుకుంటాడని ప్రశంసించాడు. ప్రపంచంలోని బౌలర్లందరికీ కోహ్లీ ఒక పెద్ద సవాల్ అంటూ కితాబిచ్చాడు.
virat kohli
team india
mohammad amir
pakistan fast bowler

More Telugu News