pavan: 'అజ్ఞాతవాసి' విషయంలో త్రివిక్రమ్ కి పవన్ పెట్టిన కండిషన్!

  • షూటింగు దశలో 'అజ్ఞాతవాసి'
  • కేరళలో తాజా షెడ్యూల్ పూర్తి 
  • నెక్స్ట్ షెడ్యూల్ యూరప్ లో 
  • జనవరి 10న విడుదల  
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ తాజా చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలావరకూ పూర్తయింది. తాజాగా కేరళలో ఒక షెడ్యూల్ ను పూర్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించాలని పవన్ భావిస్తున్నాడు. అందువలన ఈ సినిమా షూటింగ్ ను నవంబర్ 25 నాటికి పూర్తి చేయమని త్రివిక్రమ్ కి చెప్పాడట.

 ఆ దిశగా త్రివిక్రమ్ పనులను వేగవంతం చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చేనెల 15వ తేదీ వరకూ యూరప్ లో చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వచ్చేనెల 25 నాటికి పూర్తయ్యేలా చూస్తున్నాడట. డిసెంబర్లో ఆడియో వేడుకను నిర్వహించి, జనవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.   
pavan
keerthi

More Telugu News