హైదరాబాద్: హైదరాబాద్ లో నకిలీ డ్రగ్స్ దందా!

  • చైతన్యపురిలోని తయారీ కేంద్రంపై పోలీసుల దాడి
  • గర్భిణీలు, చిన్నపిల్లలు ఉపయోగించే నకిలీ మందుల తయారీ
  • నకిలీ సరుకును స్వాధీనం చేసుకున్న పోలీసులు

హైదరాబాద్ లో నకిలీ డ్రగ్స్ దందా బట్టబయలైంది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డ్రగ్స్ తయారవుతున్న సమాచారం మేరకు రాచకొండ పోలీసులు రంగంలోకి దిగారు. డ్రగ్స్ తయారీ కేంద్రంపై ఈరోజు దాడి చేశారు. గర్భిణీలు, చిన్నపిల్లలు ఉపయోగించే మందులను వీరు తయారు చేస్తున్నట్టు పోలీసుల సమాచారం.

 గర్భిణీలు ఉపయోగించే ప్రోటీన్ పౌడర్, టానిక్స్, చిన్నపిల్లలు తాగే మిల్క్ పౌడర్ లను ఈ తయారీ కేంద్రంలో గుర్తించామని, ఇవన్నీ నకిలీవేనని పోలీసులు చెప్పారు. నకిలీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని చెప్పారు. ఈ కేంద్రం యజమానిని రాజేందర్ రెడ్డిగా గుర్తించామని, నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్టు చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు రాచకొండ పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News