holiday: తెలంగాణలో దీపావళి సెలవు 18న కాదు...19న?

  • సెలవుల క్యాలెండర్ లో దీపావళి అక్టోబర్ 18న
  • అమావాస్య అక్టోబర్ 19న
  • దీపావళి సెలవు మార్చాలన్న వివిధ సంఘాలు
తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవు దినాన్ని మార్చనుంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన 2017 సెలవుల క్యాలెండర్ లో దీపావళి సెలవును అక్టోబర్ 18గా పేర్కొంది. అయితే, అక్టోబర్ 19న అమావాస్య రావడంతో ఉద్యోగ సంఘాలు, అధికారులు, పండితులు, ఉపాధ్యాయ సంఘాలు, ఇతర సంఘాల నుంచి వచ్చిన వినతి మేరకు తెలంగాణ‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్‌ దస్త్రం రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదానికి పంపించారు. ఈ నేపథ్యంలో దీపావళి సెలవు అక్టోబర్ 19న ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీనిపై సీఎం నేడు నిర్ణయం తీసుకోనున్నారు. 
holiday
deepavali
festival
telangana

More Telugu News