రామ్ గోపాల్ వర్మపై నటి వాణీ విశ్వనాథ్ ఫైర్.. ఇంటి ముందు ధర్నా చేస్తామంటూ వార్నింగ్
- 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరులోనే వ్యాపారం ఉంది
- ఈ సినిమాపై అనుమానాలున్నాయి
- సినిమా తీయడాన్ని వర్మ మానుకుంటే మంచిది
ఒకవైపు ఎన్టీఆర్ బయోపిక్ ను బాలకృష్ణ తీయబోతున్న తరుణంలోనే... ఇలాంటి సినిమాను తీయడానికి వర్మ ప్రయత్నిస్తుండటం సరైంది కాదని తెలిపారు. సినిమాకు వర్మ పెట్టిన పేరులోనే వ్యాపారం, వివాదం దాగి ఉన్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ తీయబోయే సినిమాపై అనుమానాలున్నాయని అన్నారు. కేవలం దురుద్దేశంతోనే వర్మ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని మండిపడ్డారు. సినిమాను గొప్పగా తీస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. ఈ సినిమా తీయడం మానేయాలని వర్మను తాను కోరుతున్నానని చెప్పారు.