geetamadhuri: విమర్శలకు బాధపడను .. నా పాటలు వినమని వాళ్లకు చెబుతాను : గీతామాధురి

  • ఐటమ్ సాంగ్స్ బాగా పాడుతుందనే పేరు
  • మెలోడీస్ కూడా మంచి పేరు తెచ్చాయంటోన్న గీతామాధురి 
  • ఎవరి అభిప్రాయం వారిది  
గీతామాధురి ఐటమ్ సాంగ్స్ బాగా పాడుతుందనీ .. మిగతా పాటలతో ఆమె అంతగా మెప్పించలేదనే టాక్ వుంది. గీతామాధురిపై గల ఈ విమర్శను గురించి ఐడ్రీమ్స్ ప్రస్తావించగా, ఆమె తనదైన శైలిలో స్పందించింది. తన వాయిస్ గురించి అలాంటి విమర్శలు చేసే వారికి, తన పాటలు వినమని చెబుతానని అంది.

 తాను చాలా సినిమాల్లో మెలోడీ సాంగ్స్ పాడాననీ, ఆ పాటలకి కూడా తనకి మంచి పేరు వచ్చిందని చెప్పింది. తన వాయిస్ లో మెలోడీ పలుకుతుందనే విషయం సంగీత దర్శకులకు తెలుసునని అంది. వేరే పాటలకు తన వాయిస్ సెట్ కాదని విమర్శలు వచ్చినా .. అది వాళ్ల అభిప్రాయమని అనుకుంటానేగానీ, వాటిని పట్టించుకుని బాధపడుతూ కూర్చోనని చెప్పింది. విమర్శల వలన తనకి వచ్చే అవకాశాలు తగ్గుతాయేమో గానీ .. తనలోని సంతోషం మాత్రం ఎప్పుడూ ఇలాగే ఉంటుందని స్పష్టం చేసింది.          
geetamadhuri

More Telugu News