కల్నల్ భార్యతో అక్రమసంబంధం... బ్రిగేడియర్ సీనియారిటీని పదేళ్లు కోసేసిన జనరల్ కోర్టు మార్షల్
- అక్రమ సంబంధం ఆర్మీలో చాలా పెద్ద నేరం
- కోర్టులో నేరం ఒప్పుకున్న బ్రిగేడియర్
- పదేళ్ల సీనియారిటీ తగ్గిస్తూ తీర్పు
ఆర్మీలో ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం చాలా పెద్ద నేరం. ఇలా చేసి దొరికిపోతే, వారిని విధుల నుంచి తొలగించడం, పెన్షన్, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వకుండా పంపడం వంటివి చేస్తారు. ఇక, ఈ బ్రిగేడియర్ తన తప్పును ఒప్పుకోవడంతోనే స్వల్ప శిక్షతో సరిపెట్టినట్టు ఓ అధికారి తెలిపారు. ఇతనిపై మొత్తం 13 అభియోగాలు నమోదయ్యాయి. అన్నింటినీ అంగీకరించాడు. పదేళ్ల సీనియారిటీ పోవడంతో, ఇతనికన్నా ఎన్నో ఏళ్ల చిన్నవారికి ముందుగానే ప్రమోషన్లు రానున్నాయి.