సూసైడ్ కేస్: ప్రియుడు మోసం చేశాడని చంద్రబాబుకి ఫిర్యాదు చేయడానికి వచ్చి.. నిద్రమాత్రలు మింగిన అమ్మాయి!
- అమరావతిలోని సచివాలయం ముందు అలజడి
- స్పృహతప్పి పడిపోయిన యువతి
- పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆవేదన
ప్రేమించిన యువకుడు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవాలని వెళ్లిన ఓ యువతి అమరావతిలోని సచివాలయం ముందు అలజడి రేపింది. సీఎంని కలిసి ఫిర్యాదు చేసే అవకాశం దొరకట్లేదని సచివాలయం ప్రధానగేటు ఎదుట నిద్రమాత్రలు మింగి స్పృహతప్పి పడిపోయింది. విజయనగరానికి చెందిన శ్రవణ్ అనే వ్యక్తి తనను ప్రేమించి మోసం చేశాడని, ఈ విషయంపై తాను ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయినా వారు స్పందించలేదని అంతకు ముందు ఆ యువతి తెలిపింది. ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.