Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రష్మీ ప్లేస్ లో 'జబర్దస్త్'లో హరితేజ!

  • 'బిగ్ బాస్' షో తో పాప్యులర్ అయిన హరితేజ
  • బుల్లితెర ప్రేక్షకుల్లో పెరిగిన క్రేజ్
  • టీవీ చానల్స్ నుంచి ఆమెకి పెరుగుతోన్న అవకాశాలు 
ఈటీవీలో ప్రసారమవుతోన్న మల్లెమాల వారి 'జబర్దస్త్' కార్యక్రమానికి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. చాలాకాలం నుంచి ఈ కార్యక్రమం మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ కార్యక్రమానికి యాంకర్ గా రష్మీ వ్యవహరిస్తోంది. త్వరలో ఈ ప్లేస్ లో హరితేజ కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది.

 ఇటీవల 'స్టార్ మా'లో ప్రసారమైన 'బిగ్ బాస్' షో ద్వారా హరితేజ బాగా పాప్యులర్ అయింది. ఆమె అందరి మనసులను ఎక్కువగా దోచుకున్న కారణంగా, ఆమెను రష్మీ ప్లేస్ లోకి తీసుకోవాలనే నిర్ణయానికి నిర్వాహకులు వచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే రష్మీని తప్పించలేదని, తనే తప్పుకుంటోందనే టాక్ కూడా వినిపిస్తోంది. 'బిగ్ బాస్' సెకండ్ సీజన్ లో పాల్గొనబోయేవారి జాబితాలో రష్మీ పేరు కూడా ఉందట. అందువలన రష్మీకి కొంత గ్యాప్ రానుంది. అందుకే హరితేజను తీసుకోనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.    
hariteja

More Telugu News