'పుర' ప్రాజెక్టును పూర్తి చేయండి... చంద్రబాబుకు బహిరంగలేఖ రాసిన రఘువీరా!
- ఓ సదుద్దేశంతో 'పుర' ప్రాజెక్టును ప్రారంభించాం
- ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం తగదు
- పనులు చేపట్టకపోతే భారీ ఉద్యమం తప్పదు
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ కు పేరొస్తుందని, నాయకులకు కమిషన్లు రావనే ఉద్దేశంతో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పనులపై ప్రభుత్వ అలసత్వాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగానే తాము ఈ డిమాండ్ చేస్తున్నామని... అవసరమైతే 'పుర' అనే పేరు బదులు 'చంద్రబాబు పథకం' అంటూ పేరు మార్చుకున్నా తమకు అభ్యంతరం లేదని అన్నారు. నెల రోజుల్లో పనులను ప్రారంభించి, మూడు నెలల్లోగా పూర్తి చేయాలని... లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవనెత్తుతామని అన్నారు.