రూ. 1,149 నుంచి 'విస్తారా' ఎయిర్ లైన్స్ దివాలీ సేల్!

  • 48 గంటల ఫెస్టివ్ సేల్ ప్రారంభం
  • శుక్రవారం లోగా బుక్ చేసుకునే అవకాశం
  • ఆపై మార్చి 24 వరకూ ప్రయాణానికి అవకాశం
ఈ దీపావళి పర్వదినం సందర్భంగా 48 గంటల పాటు ఫెస్టివ్ సేల్ కు ఎకానమీ క్లాస్ లో రూ. 1,149, ప్రీమియం ఎకానమీ క్లాస్ లో రూ. 2,099 ప్రారంభ ధరల నుంచి విక్రయించనున్నట్టు 'విస్తారా' ఎయిర్ లైన్స్ తెలిపింది. నేటి నుంచి శుక్రవారం రాత్రి 23.59 వరకూ టికెట్లను బుక్ చేసుకుని, అక్టోబర్ 26 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 24లోగా ప్రయాణ తేదీని నిర్ణయించుకోవచ్చని విస్తరా ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా, జమ్మూ - శ్రీనగర్, ఢిల్లీ - చండీగఢ్ రూట్లలో రూ. రూ. 1,200కన్నా లోపుగానే టికెట్ ఫేర్ కనిపిస్తుండగా, ఢిల్లీ - అమృతసర్ మధ్య రూ. 1,299, ఢిల్లీ - అహ్మదాబాద్ మధ్య రూ. 1,499, ఢిల్లీ - వారణాసి మధ్య రూ. 1,899, ఢిల్లీ - హైదరాబాద్ మధ్య రూ. 2,499, ఢిల్లీ - భువనేశ్వర్ మధ్య రూ. 2,599కి, ముంబై - అమృతసర్ మధ్య రూ. 2,999కి టికెట్లను అందుబాటులో ఉంచామని సంస్థ పేర్కొంది.
Go Back to Shorts
vistara
diwali sale
low cost

More Telugu News