'శ్రీమంతుడు' రికార్డుకు దగ్గరలో 'జై లవ కుశ'
- కొనసాగుతోన్న 'జై లవ కుశ' జోరు
- తెలుగు రాష్ట్రాల్లో 57 కోట్ల షేర్
- ప్రపంచవ్యాప్తంగా 77 కోట్ల షేర్
- మొత్తంగా 150 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరినట్టు ట్రేడ్ పండితుల అంచనా
అయితే అధికారికంగా ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించవలసి వుంది. టాలీవుడ్ లో ఇంతవరకూ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలలో, 164 కోట్లను సాధించి 'ఖైదీ నెంబర్ 150' మొదటిస్థానంలో ఉండగా, 156 కోట్లను రాబట్టి 'శ్రీమంతుడు' రెండవ స్థానంలో వుంది. 'శ్రీమంతుడు' వసూళ్లకు చేరువైన 'జై లవ కుశ' .. ఆ రికార్డును అధిగమిస్తుందా .. లేదా? అనే ఆసక్తికరంగా మారింది.