అమెరికన్ ఆర్థిక నిపుణుడు రిచర్డ్ హెచ్. థాలర్కి 2017 ఆర్థిక శాస్త్ర నోబెల్
- వెల్లడించిన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్
- బిహేవియోరల్ ఎకనామిక్స్‌ను వివరించిన థాలర్
- షికాగో యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న థాలర్
వాస్తవానికి ఆర్థికశాస్త్రంలో నోబెల్ ఇవ్వాలని ఆల్ఫ్రెడ్ నోబెల్ తన వీలునామాలో పేర్కొనలేదు. అయితే, ఆయన జ్ఞాపకార్థం స్వీడన్ జాతీయ బ్యాంకు ఈ అవార్డును అందజేస్తుంది. దీన్ని స్వెరీష్ రిక్స్‌బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్ కోసం భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్ రాజన్ పేరును కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి.